ఇయర్ ఎండ్ స్పెషల్: 2019 టాప్ మూవీస్

Friday,December 27,2019 - 10:05 by Z_CLU

ఇయర్ స్టార్టింగ్ నుంచి మినిమం గ్యాప్స్ లో బ్లాక్ బస్టర్స్ వస్తూనే ఉన్నాయి. ఎఫ్2 నుంచి ప్రారంభించి, మొన్నటి ప్రతిరోజూ పండగే సినిమా వరకు చూసుకుంటే ఈసారి టాలీవుడ్ కళకళలాడింది. ఎప్పట్లానే సక్సెస్ పర్సంటేజ్ 5 శాతం కూడా దాటనప్పటికీ.. రెవెన్యూ బాగా జనరేట్ అవ్వడంతో పాటు, ఊహించని విజయాల్ని అందించింది టాలీవుడ్.

ఈ ఏడాది విజయాల జాబితాను సైరా నుంచే స్టార్ట్ చేయాలేమో. ఎందుకంటే, ఇది ఎంత కలెక్ట్ చేసిందనే విషయాన్ని పక్కనపెడితే, ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురుచూశారనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఇంకా చెప్పాలంటే బాహుబలి-2 తర్వాత ఆ స్థాయిలో ఎదురుచూపులు ‘సైరా’ కోసమే కనిపించాయి. అలా మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా నిలిచిన మెగాస్టార్ మూవీ, అంచనాల్ని అందుకుంది. డొమస్టిక్ గానే కాకుండా, ఓవర్సీస్ లో కూడా సంచలనాలు నమోదుచేసింది.

‘సైరా’ తర్వాత కచ్చితంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘మహర్షి’. మహేష్ నుంచి ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ ‘మహర్షి’ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే కెరీర్ లో మహేష్ కిది 25వ చిత్రం కాబట్టి. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సందేశంతో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకుడు.

ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన ‘ఎఫ్2’ కూడా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయించడమే కాకుండా, కాసుల వర్షం కూడా కురిపించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ లాంటి ఇద్దరు హీరోలతో దర్శకుడు అనిల్ రావిపూడి నవ్వులు పూయించిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన టాలెంట్ చూపించారు.

2019లో ఎన్ని హిట్స్ వచ్చినా ‘ఇస్మార్ట్ శంకర్’ ను మాత్రం మరింత స్పెషల్ గా చూడాలి. ఎందుకంటే, ఇంత మాస్ మూవీ ఈమధ్య కాలంలో, ఈ ఏడాది ఇంకోటి రాలేదు. రామ్ కెరీర్ లోనే ఫుల్ లెంగ్త్ మాస్ మూవీగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్శంకర్’ అతడి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించడమే కాదు, పాటలతో కూడా రఫ్ఫాడించింది.

అటు నాగచైతన్య కూడా ఈ ఏడాదిని మెమొరబుల్ ఇయర్ గా మార్చుకున్నాడు. ఇతడు నటించిన ‘మజిలీ’ సినిమా టాప్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మోస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ గామారింది ఈ సినిమా. శివ నిర్వాణ డైరక్ట్ చేసిన ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యాడు చైతూ.

మాస్ మాసాలాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్స్ మాత్రమే హిట్స్ అవుతాయని అనుకునే కొంతమంది భ్రమల్నిపటాపంచలు చేసింది ‘జెర్సీ’ మూవీ. హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంది. గౌతమ్ తిన్ననూరి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో బాబు పాత్రలో నాని అద్భుతంగా నటించాడు. భార్యభర్త, తండ్రికొడుకు,క్రికెటర్-కోచ్.. ఇలా ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. 2019లో వచ్చిన మోస్ట్ ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీ ‘జెర్సీ’ మాత్రమే.

ఇక ‘గద్దలకొండ గణేష్’ కూడా ఈ ఏడాది హిట్ లిస్ట్ లో చేరిపోయింది. వరుణ్ తేజ్ ను నెగెటివ్ షేడ్స్ లో చూపించిన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ను ఎలా అందిస్తే, ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడో బాగా తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్.. ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ ప్రూవ్చేసుకున్నాడు. ఆఖరి నిమిషంలో టైటిల్ మార్చినా సినిమా కంటెంట్ బాగుండడంతో, ఆ ప్రభావం బాక్సాఫీస్ సక్సెస్ పై పడలేదు.

రియల్ లైఫ్ మామాఅల్లుడు వెంకటేష్-నాగచైతన్య కలిసి నటించిన సినిమా ‘వెంకీమామ’. ఈ కాంబినేషనే ఈ మూవీని టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. బాబి డైరక్ట్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఆల్రెడీ వరల్డ్ వైడ్ 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా, సంక్రాంతి బరిలో కూడా నిలుస్తుందనడంలోఎలాంటి డౌట్ అక్కర్లేదు.

ఇక 2019కు గ్రాండ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చిన  మూవీ ప్రతి రోజూ పండగే. సాయితేజ్, మారుతి కాంబోలో వచ్చిన ఈ సినిమా నవ్వులు పూయించడమే కాదు, మనసులకు హత్తుకుంటోంది కూడా. ప్రస్తుతం థియేటర్లలో హౌజ్ ఫుల్ కలెక్షన్లలో నడుస్తున్న సినిమా కూడా ఇదొక్కటే.

ఓవరాల్ గా 2019 సంవత్సరానికి ‘ఎఫ్2’ సినిమా మంచి ప్రారంభాన్ని అందిస్తే, ప్రతి ‘రోజూ పండగే’ సినిమా మంచి ముగింపునిచ్చింది.