యాత్ర టీజర్: మరో క్లాసిక్ రాబోతోందా..?

Sunday,July 08,2018 - 09:23 by Z_CLU

గెలిస్తే పట్టుదల అంటారు
ఓడిపోతే మూర్ఖత్వం అంటారు
పాదయాత్ర.. నా మూర్ఖత్వమో, పట్టుదలో చరిత్రే నిర్ణయిస్తుంది
ఈ ఒక్క డైలాగ్ తో యాత్ర సినిమాలో ఏం చెప్పదలుచుకున్నారో క్లియర్ గా చెప్పేసింది యూనిట్. షూటింగ్ ప్రారంభించిన 10 రోజులకే టీజర్ రిలీజ్ చేయడమంటే మాటలు కాదు. కానీ టీజర్ రిలీజ్ చేయకపోతే, వైఎస్ఆర్ జయంతి అనే ఓ మంచి అకేషన్ మిస్ అయిపోతుంది. అందుకే 10 రోజుల ఫుటేజ్ తోనే రాత్రిపగలు కష్టపడి, అద్భుతమైన టీజర్ ను రిలీజ్ చేశారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఘట్టాన్ని నేపథ్యంగా తీసుకొని తెరకెక్కుతోంది యాత్ర సినిమా. ఈ మూవీకి సంబంధించి ఈరోజు టీజర్ రిలీజైంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు మహి వి రాఘవ్ డైరక్టర్.

ఈ మూవీకి మమ్ముట్టి సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. గతంలో స్వాతికిరణం సినిమాకు కూడా ఈయన సొంతంగానే డబ్బింగ్ చెప్పుకున్నారు. టీజర్ లో కే అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.

70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. 70 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.