'యాత్ర' షూటింగ్ .... మమ్ముట్టీ కి గ్రాండ్ వెల్కం

Saturday,June 23,2018 - 03:28 by Z_CLU

మహి వి రాఘవ్ డైరెక్షన్ లో  ‘యాత్ర’  సినిమా చేస్తున్నాడు మమ్ముట్టీ… వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కథతో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఇటివలే హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. దాదాపు 25 ఏళ్ళ తర్వాత మమ్ముట్టీ తెలుగులో  నటిస్తున్న  సినిమా ఇది. అందుకే తొలిరోజు సెట్లో అడుగుపెట్టిన మలయాళం సూపర్ స్టార్ కి మెగా వెల్కం చెప్పారు యూనిట్. మమ్ముట్టీ నడుస్తూ సెట్లో సందడి చేసిన  వెల్కం వీడియో ప్రెజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్  వరకూ  జరగనున్న సింగిల్ షెడ్యూల్ ఫినిష్ చేయాలనీ భావిస్తున్నారు.