"ఈనాటి ఈ సుప్ర‌భాత‌ గీతం నీకిదే అన్నది స్వాగ‌తం"

Monday,September 03,2018 - 11:01 by Z_CLU

ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి గా రాష్ట్ర‌రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్ లొ మ‌ళ‌యాల సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి న‌టిస్తున్న యాత్ర చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ విడ‌ద‌ల చేశారు. ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ బ‌యెపిక్ ని తెర‌కెక్కిస్తున్నారు. మ‌డ‌మ‌తిప్ప‌ని నాయికుడి పాత్ర‌లో న‌టిస్తున్న మమ్మ‌ట్టి పూర్తిగా ఆ ప్ర‌జానాయ‌కుడి పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన మెద‌టి లుక్ కి, టీజ‌ర్ కి రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల నుండి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌టంతో యూనిట్ అంతా చాలా ఆనందంగా వున్నారు.

సినిమాని వ్యాపారంగా కాకుండా ప్యాష‌న్ గా చిత్రాలు నిర్మించే నిర్మాణ సంస్థ‌లు తెలుగు ఇండ‌స్ట్రిలో చాలా త‌క్కువ. ఆ కోవ‌లోకి వ‌చ్చే మ‌రో నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ . ఈ బ్యాన‌ర్ పై నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి లు సంయుక్తంగా భ‌లేమంచిరోజు, ఆనందోబ్ర‌హ్మ చిత్రాలు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. బ్యాన‌ర్ లో హ్య‌ట్రిక్ చిత్రంగా రూపోందుతున్న యాత్ర ని ప్రెస్టెజియ‌స్ ప్రోజెక్ట్ గా, అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమెష‌న్ తో కూడిన పాత్ర‌లు, పాత్ర తీరులు క‌నిపిస్తాయి. తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా చూడ‌వ‌ల‌సిన చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు.

మెద‌టి సింగిల్ ని సిరివెన్నెల సీతారామ‌శాస్ట్రి గారు ఎమెష‌న‌ల్ లిరిక్స్ అందించ‌గా , కె అద్బ‌త‌మైన సంగీతాన్ని అందించాడు.