తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజైన యముడు-3

Thursday,February 09,2017 - 11:14 by Z_CLU

సూర్య నటించిన సింగం-3 సినిమా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజైంది. కొన్ని నెలలుగా మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా నిలిచిన ఈ సినిమా కోసం టోటల్ సౌత్ అంతా ఎదురుచూసింది. వంద రోజుల పాటు వాయిదాపడిన తర్వాత, ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎర్లీ మార్నింగ్ షోలు రద్దయినప్పటికీ… ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు.. ఏపీ, తెలంగాణలో యముడు-3 సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అన్ని సెంటర్ల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.

అటు కోలీవుడ్ లో మాత్రం సింగం-3 సినిమా సాఫీగా విడుదలైంది. తొలిరోజు ఈ సినిమా చూసేందుకు సూర్య ఫ్యాన్స్ పోటెత్తారు. చెన్నైలో ఈ సినిమాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. నార్త్ తమిళనాడులో సినిమా సూపర్ హిట్ అనే టాక్ ఇప్పటికే వచ్చేసింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా హిట్ టాక్ తో ప్రారంభమైంది. అనుష్క-శృతిహాసన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు హరి దర్శకుడు.

singham-3-yamudu-3zee-cinemalu-2