యామినీ భాస్కర్ ఇంటర్వ్యూ

Wednesday,September 19,2018 - 03:14 by Z_CLU

రీసెంట్ గా ‘నర్తనశాల’ లో కనిపించి మెస్మరైజ్ చేసిన యామినీ భాస్కర్, ‘భలే మంచి చౌక బేరం’ సినిమాలోను హీరోయిన్ గా నటించింది. పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోవాలని ట్రై చేస్తున్న యామినీ భాస్కర్, ఈ సినిమా అందరినీ ఎంటర్టైన్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సందర్భంగా మీడియాతో చేసిన చిట్ చాట్…

అదే నా క్యారెక్టర్…  

సినిమాలో నా క్యారెక్టర్ పేరు ఆదర్శి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే నాకుందా లేదా అని కూడా చూసుకోకుండా అందరికీ హెల్ప్ చేసేస్తుంటా… అయితే హీరో కూడా నా మంచితనాన్ని క్యాష్ చేసుకొని మోసం చేస్తాడు.. అక్కణ్ణించి స్టోరీ బిగిన్ అవుతుంది.

నర్తనశాల కన్నా ముందే…

ఈ సినిమా నర్తనశాల కన్నా ముందే రావాల్సింది. కాకపోతే ఆ సినిమా కొంచెం క్విక్ గా రిలీజ్ అయింది.

చేస్తే బావుంటుంది…

నాకు కామెడీ చేయడం అంటే చాలా ఇష్టం కానీ, అలాంటి క్యారెక్టర్స్ రావడం లేదు. వస్తే మాత్రం తప్పకుండా చేస్తా.

కొత్త కాన్సెప్ట్…

‘భలే మంచి చౌక్ బేరం’ లో నాన్ సింక్ కామెడీ ఉంటుంది. కన్ఫ్యూజన్ వల్లే ఎక్కువ కామెడీ జెనెరేట్ అవుతూ ఉంటుంది. ఇక కాన్సెప్ట్ విషయానికి  వస్తే  కంప్లీట్ గా కొత్తగా ఉంటుంది.

నో ప్రెజర్.. నథింగ్…

షూటింగ్ లో మహా అయితే 5 నుండి 10 మంది ఉండేవాళ్ళు. దాంతో డైరెక్టర్ కి కూడా ప్రెజర్ ఉండేది కాదు. దాంతో కూల్ గా షూట్ చేసుకునే వాళ్ళం. చాలా ఫన్ ఉండేది లొకేషన్ లో.

అదొకటి అర్థమైంది…

ఇండస్ట్రీకి వచ్చిన ఈ 3 ఏళ్ళలో చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా ఎలాంటి సినిమాలు ఆడతాయి. ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలి తెలిసింది.

నా చేతుల్లో లేదు..

నేను సక్సెస్ అవుతానో లేదో నా చేతుల్లోలేదు కానీ వీలైనంత వరకు మంచి సినిమాలు చేస్తూ మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను.

తమిళంలో…

తమిళంలో కూడా ఒక సినిమా చేశాను. లాస్ట్ ఇయర్ రిలీజయింది. ఆ తరవాత కూడా ఆఫర్స్ వచ్చాయి కానీ, మంచి బ్యానర్ లో వస్తే చేద్దామని అనుకుంటున్నాను.