యామినీ భాస్కర్ ఇంటర్వ్యూ

Monday,August 27,2018 - 02:36 by Z_CLU

నాగశౌర్య @నర్తనశాల ఈ నెల 30 న గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సినిమాలో నాగశౌర్య సరసన హీరోయిన్ గా నటించిన యామినీ భాస్కర్, సినిమా సక్సెస్ గ్యారంటీ అని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన యామినీ భాస్కర్, సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెప్పుకుంది.

అదే నేను…

సినిమాలో నాది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఒక అమ్మాయి ధైర్యంగా ఉండాలి, ఫేస్ చేయాలి అనుకునే క్యారెక్టర్.. సినిమాలో నా పేరు సత్యభామ.

అలా అనుకుంటున్నా…

గతంలో ‘కీచక’ సినిమా చేశాను. అందులో నా పర్ఫామెన్స్ కి మంచి అప్లాజ్ వచ్చింది కానీ, సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఈ సినిమా నా కరియర్ కి డెఫ్ఫినేట్ గా ప్లస్ అవుతుందనే అనుకుంటున్నా…

డామినేషన్ లేదు…

ఇండస్ట్రీ లో ఎక్కడా హీరోయిన్స్ మధ్య డామినేషన్ లేదు. కాంపిటీషన్ ఉంది. హీరోయిన్స్ కాస్టింగ్ విషయానికి వచ్చేసరికి ఫిలిమ్ మేకర్స్ కి చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి డెఫ్ఫినేట్ గా బెస్ట్ నే ప్రిఫర్ చేస్తారు.

అదే నా కోరిక…

నాకు మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ గారు చేసిన క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం.

వేరియేషన్ ఉంటుంది…

సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా 2 క్యారెక్టర్స్ కి మధ్య చాలా వేరియేషన్ ఉంటుంది. ఏ క్యారెక్టర్ కి అదే చాలా స్పెషల్…

ప్రాక్టీస్ చేశాను…

సినిమాలో ఈ క్యారెక్టర్ కోసం ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. స్పెషల్ గా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కోసం. సినిమాలో నేను మరీ హెవీ ఫైట్స్ చేయలేదు కానీ, కొద్దిగా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది.

ఫ్రమ్ విజయవాడ…

నేను పుట్టి పెరిగింది విజయవాడ. 4 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ కి వచ్చాను.

ప్రస్తుతం సినిమాలు…

మారుతి గారి సినిమా ‘భలే మంచి చౌకబేరం’ లో నటించాను. ఆ సినిమా సెప్టెంబర్ లో రిలీజవుతుంది.