ఫెయిర్ అండ్ లవ్లీ భామ ఇలా మారిపోయింది

Monday,October 17,2016 - 11:40 by Z_CLU

అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “Sarkar 3” లో నటిస్తున్న ఇతరత్రా యాక్టర్స్ ఫస్ట్ లుక్ ని వరసగా సోషల్ మీడియాలో షేర్ చేసిన RGV, సుభాష్ కర్కరే గా నటిస్తున్న అమితాబ్ బచ్చన్ ని చంపడానికి ప్రయత్నించే యువతి పాత్రలో యామీ గౌతమ్ నటిస్తుందని ప్రకటించాడు.

yami-gautham-111

గౌరవం సినిమాలో శిరీష్ సరసన నటించిన యామీ గౌతమ్, తెలుగులో చెప్పుకోదగ్గ గుర్తింపు తెచ్చుకోకపోయినా మొత్తానికి RGV దృష్టిలో పడింది. ఇప్పటి వరకు అందంగా, గ్లామరస్ పాత్రల్లో కనిపించిన యామీ, ఈ సినిమాలో తన తండ్రి చావుకు కారణమైన వ్యక్తిని చంపాలనే, పగతో రగిలిపోయే యువతి పాత్రలో కనిపించనుంది. రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమాని ఏప్రిల్, మే నాటికి విడుదల చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.