తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో విడుదలైన యమన్

Friday,February 24,2017 - 11:08 by Z_CLU

బిచ్చగాడు మూవీతో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న విజయ్ ఆంటోనీ… ఇప్పుడు యమన్ గా మనముందుకొచ్చాడు. విజయ్ ఆంటోనీ సినిమాలంటే కచ్చితంగా కొత్తగా ఉంటాయి… పైసా వసూల్ అనే ఇమేజ్ ఇప్పటికే ఉండడంతో… యమన్ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టు… యమన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదలైంది. విజయ్ ఆంటోనీ కెరీర్ లోనే ఏపీ, తెలంగాణలో అత్యథిక స్థాయి థియేటర్లు యమన్ కు దక్కడం విశేషం.

శివరాత్రి కానుకగా ఈరోజు విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్  వస్తోంది. యమన్ రిలీజైన ప్రతి థియేటర్ దగ్గర భారీ క్రౌడ్ కనిపించింది. తెలుగులో ఈ సినిమా ప్రమోషన్ ను విజయ్ ఆంటోనీ దగ్గరుండి చూసుకున్నాడు. ప్రచారానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాడు. ఫస్ట్ లుక్ నుంచి ఆడియో రిలీజ్, ట్రయిలర్ లాంచ్ వరకు ప్రతి ఒక్క ఈవెంట్ ను తెలుగులో కూడా సెలబ్రేట్ చేశాడు. ఇలా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడంతో ఆటోమేటిగ్గా తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు విజయ్ ఆంటోనీ.

ఈమధ్య కాలంలో ఇంత తక్కువ టైంలో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిన తమిళ హీరో మరొకరు లేరనే చెప్పాలి. రజనీకాంత్, అజిత్, సూర్య, కార్తి తర్వాత ఫుల్ లెంగ్త్ లో టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు విజయ్ ఆంటోనీ. యమన్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో, తెలుగులో విజయ్ ఆంటోనీ క్రేజ్ మరింత పెరిగింది.