ఫస్ట్ రిలీజ్ ఇండియాలోనే...

Thursday,December 29,2016 - 09:30 by Z_CLU

బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొనె ఉన్నట్టుండి ఓ గ్రాండ్ సప్రయిజ్ ఇచ్చింది. ఈ వార్త విని దీపిక ఫాన్స్ తో పాటు సినిమా లవర్స్ అందరు సంతోషిస్తున్నారు. ఇంతకీ దీపిక చెప్పిన ఈ వార్త ఏమిటంటే ఈ భామ లేటెస్ట్ గా ‘xxx – రిటర్న్ అఫ్ జెండర్ కేజ్’ అనే హాలీవుడ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది ఈ హాట్ బ్యూటీ.  వాన్ డీజిల్ హీరో గా నటించిన ఈ సినిమాలో ‘సెరెనా’ అనే పాత్ర లో నటించింది దీపిక.

xxx

   డైరెక్టర్ డీజే కార్సో తెరకెక్కించిన ఈ సినిమా ముందుగా ఇండియాలోనే రిలీజ్ కానుందట. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14 న ఇండియా లో రిలీజ్ చేసి… అదే నెల 20న మిగతా దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ట్వీట్ చేసి ఫాన్స్ కు సప్రయిజ్ ఇచ్చింది దీపికా…