Writer Padmabhushan మహిళలకు ఉచితం

Tuesday,February 07,2023 - 12:05 by Z_CLU

Writer Padmabhushan free show for womens in AP, TS

సుహాస్ హీరోగా షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకుడిగా ఛాయ్ బిస్కెట్ , లహరి ఫిలిమ్స్ నిర్మించిన ‘రైటర్ పద్మభూషణ్’ Writer Padmabhushan సూపర్ హిట్ టాక్ తో ముందుకు వెళ్తుంది. తాజాగా మహేష్ బాబు సినిమా చూసి టీంను అభినందించాడు. ఇప్పటికే 5 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ సినిమాకు సంబంధించి ఎవరూ ఊహించని ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు మేకర్స్.

మహిళల చూడాల్సిన మంచి కథతో వచ్చిన ఈ సినిమాను మహిళా ప్రేక్షకుల కోసం ఫ్రీ షో వేయబోతున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో మహిళలకు కొన్ని థియేటర్స్ లో ఫ్రీ షో ఉండబోతుంది. మల్టీప్లెక్స్ మినహా రెండు రాష్ట్రాల్లో మహిళా ప్రేక్షకులకు ఉచితంగా సినిమాను చూపించే నిర్ణయం తీసుకొని ప్రకటించారు.

ఇప్పటికే థియేటర్స్ యాజమాన్యం ‘ఫ్రీ షో ఫర్ ఉమెన్స్’ అంటూ  ప్రకటనలు ఇస్తూ మహిళా ప్రేక్షకులను సినిమాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కలర్ ఫోటోతో మంచి గుర్తింపు అందుకున్న సుహాస్ ఈ సినిమాతో థియేటర్స్ లో  సూపర్ హిట్ కొట్టాడు. మహిళా ప్రేక్షకులకు ఉచితం అనే ప్రమోషన్ తో సినిమా జనాలకి మరింత రీచ్ అయ్యే అవకాశం ఉంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics