టాకీపార్ట్ కి ప్యాకప్...

Thursday,February 16,2017 - 03:51 by Z_CLU

వరుణ్ తేజ్ మిస్టర్ టాకీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ విషయం తానే ట్వీట్ చేసి మరీ కన్ఫం చేశాడు మెగా పవర్ ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇంకా ఏయే ఎలిమెంట్స్ పెండింగ్ ఉన్నాయో క్లారిటీ ఇవ్వలేదు కానీ, ఈ గ్యాప్ లో శేఖర్ కమ్ముల ‘ఫిదా’ కోసం అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తున్నాడు… ఫిదా లుక్స్ తో మెస్మరైజ్ చేసే మిస్టర్.

అటు శ్రీను వైట్ల మిస్టర్ కి, ఇటు శేఖర్ కమ్ముల ఫిదాకి ఒకేసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్ తేజ్, ఆ మధ్య చేతికి గాయం కావడంతో, షూటింగ్ షెడ్యూల్స్ డిస్టబ్ అయినా, మళ్ళీ బ్యాక్ టు ఫాం అనిపించుకున్న వరుణ్ తేజ్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా, సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.

శ్రీను వైట్ల మిస్టర్ లో లావణ్య త్రిపాఠి, హెబ్బ పటేల్ తో రొమాన్స్ చేస్తున్న వరుణ్ తేజ్, ఫిదాలో మలయాళం ప్రేమమ్ తో మ్యాగ్జిమం యూత్ ని ఎట్రాక్ట్ చేసిన సాయి పల్లవితో జోడీ కడుతున్నాడు. ఈ రెండు సినిమాలు ఇప్పటికే పాజిటివ్ బజ్ ని బ్యాగ్ లో వేసుకున్నాయి.