ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

Friday,May 26,2017 - 10:50 by Z_CLU

అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ రారండోయ్ వేడుక చూద్దాం. నాగచైతన్య-రకుల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. బాహుబలి-2 తర్వాత భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది రారండోయ్ వేడుక చూద్దాం.

స్టార్టింగ్ ట్రెండ్స్ ప్రకారం, ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రమోషన్ లో భాగంగా నాగ్, నాగచైతన్య చెప్పినట్టు.. సినిమాలో ఫెస్టివ్ మూడ్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. మరోవైపు దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

సోగ్గాడే చిన్నినాయనా లాంటి గ్రాండ్ హిట్ తర్వాత కల్యాణ్ కృష్ణ డైరక్ట్ చేసిన సినిమా ఇది. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించిన ఈ సినిమాలో జగపతిబాబు, నాగచైతన్యకు తండ్రిగా నటించారు.