వరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్ అప్ డేట్స్

Tuesday,September 24,2019 - 02:49 by Z_CLU

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూట్ నడుస్తోంది. త్వరలోనే యూరోప్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. వచ్చే నెల రెండో వారం నుంచి యూరోప్ లో సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్ సెట్ చేశారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ లోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు. క్రాంతిమాధవ్ డైరక్ట్ చేస్తున్న ఈ మూవీలో రాశిఖన్నా, క్యాథరీన్, ఐశ్యర్య రాజేష్, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు.

రీసెంట్ గా మూవీకి సంబంధించి టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూరోప్ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే టీజర్ లాంఛ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తారు.