'వరల్డ్ ఫేమస్ లవర్' నా లాస్ట్ లవ్ స్టోరీ

Saturday,February 08,2020 - 10:02 by Z_CLU

విజయ్ దేవరకొండ బాంబ్ పేల్చాడు. వరల్డ్ ఫేమల్ లవర్ సినిమాను తన ఆఖరి లవ్ స్టోరీగా చెప్పుకొచ్చాడు దేవరకొండ. ఇకపై ప్రేమకథలకు దూరంగా, కొత్త కథలు ట్రై చేస్తానని హింట్ ఇచ్చాడు.

“నాకు తెలుసు.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనేది నా లాస్ట్ లవ్ స్టోరీ. మనిషిలా కొంచెం మారుతున్నా. టేస్టులు కొంచెం మారుతున్నాయి. బేసికల్ గా లైఫ్ లో కొత్త దశలోకి వెళ్తున్నా. ఇది చేసేప్పుడే నాకు తెలుసు.. ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ అవబోతోందని. నా లాస్ట్ లవ్ స్టోరీలో నలుగురు బ్యూటిఫుల్ విమెన్ తో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. ఇది కల నిజమవడం లాంటిది. నలుగురూ తమ నటనతో చంపేశారు. నా లాస్ట్ లవ్ స్టోరీ కాబట్టి ఈ సినిమాని పూర్తిగా ప్రేమతో నింపేశాం.”

“విజయ్ దేవరకొండ సినిమా అంటే హడావిడి, ఎగ్జైట్‌మెంట్ ఉంటాయి. మళ్లీ వీడు ఏం సినిమా చేశాడని పబ్లిక్ లో ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. ఈసారి నేనేం చెయ్యలేదు. నేను చేసిన సినిమాలన్నింటిలో ఈ సినిమాలోనే ఎక్కువ కష్టపడ్డా. అందరం చాలా ఎఫర్ట్ పెట్టి చేశాం. ఈ సినిమాకి నేనేం హడావిడి చెయ్యలేదు. ట్రైలర్ లాంచ్ చేశాం. ఫిబ్రవరి 9న ప్రి రిలీజ్ ఈవెంట్ ఉంది. ఇప్పుడు ఈ ట్రైలర్ తో బయట హడావిడి స్టార్ట్ అవుతుంది.”