మరో అర్జున్ రెడ్డి వస్తున్నాడా..?

Friday,September 20,2019 - 05:36 by Z_CLU

అర్జున్ రెడ్డి సినిమాతో ఎగ్రెసివ్ నెస్ కు కేరాఫ్ గా మారాడు హీరో విజయ్ దేవరకొండ. ఇలాంటి హీరో నుంచి అలాంటి లుక్ వచ్చిందంటే కచ్చితంగా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడలాంటి లుక్కే వచ్చింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నుంచి విజయ్ దేవరకొండ లుక్ ను విడుదల చేశారు.

వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ లుక్ లో మరోసారి గుబురు గట్టం, భారీ హెయిర్ స్టయిల్ తో కనిపించాడు విజయ్ దేవరకొండ. చేతిలో సిగరెట్, ముఖంపై రక్తపు మరకలతో మోస్ట్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. నిజానికి టైటిల్ చూసి, ఓ సాఫ్ట్ ఫస్ట్ లుక్ వస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ అందరికీ షాకిచ్చాడు దేవరకొండ.

క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, క్యాథరీన్, ఐశ్వర్యరాజేష్, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.