వరల్డ్ ఫేమస్ లవర్ సెన్సార్ టాక్

Monday,February 10,2020 - 01:56 by Z_CLU

విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్. కొద్దిసేపటి కిందట ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. 3 మ్యూట్స్ తో సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ అధికారులు. మూవీ రన్ టైమ్ 155 నిమిషాలు.

ఈ సినిమా ట్రయిలర్ చూసి సినిమాకు చాలా కట్స్ పడతాయని అనుకున్నారు చాలామంది. కానీ కంటెంట్ లో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని తేల్చారు సెన్సార్ అఫీషియల్స్. దీంతో మూవీ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. వాలంటైన్స్ డే కానుకగా 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వస్తోంది.

విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఏకంగా నలుగురు హీరోయిన్లు నటించడం, ట్రయిలర్ క్లిక్ అవ్వడంతో మూవీపై క్రేజ్ పెరిగింది. అటు దేవరకొండ కూడా “ఈసారి సిక్స్ గ్యారెంటీ” అని ఎనౌన్స్ చేయడంతో క్రేజ్ డబుల్ అయింది.

కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాను క్రాంతి మాధవ్ డైరక్ట్ చేశాడు. రాశిఖన్నా, ఇజబెల్లే, ఐశ్వర్యరాజేశ్, క్యాథరీన్ హీరోయిన్లుగా నటించారు. గోపీసుందర్ మ్యూజిక్ ఇచ్చాడు.