వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ డే కలెక్షన్

Saturday,February 15,2020 - 02:38 by Z_CLU

విజయ్ దేవరకొండ, రాశిఖన్నా, ఇజబెల్లా, క్యాథరీన్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ కు తగ్గట్టుగానే కలెక్షన్లు కూడా ఉన్నాయి.

దేవరకొండ కెరీర్ లో బెస్ట్ ఫిగర్స్ వస్తాయనుకుంటే, వరల్డ్ ఫేమస్ లవర్ డిసప్పాయింట్ చేశాడు. అయినప్పటికీ ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పోల్చుకుంటే డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి.

ఏపీ, నైజాంలో ఫస్ట్ డే ఈ సినిమాకు 4 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది. దేవరకొండ కెరీర్ లో నాలుగో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.

ఏపీ,నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 2.01 కోట్లు
సీడెడ్ – రూ. 0.39 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.52 కోట్లు
ఈస్ట్ – రూ. 0.30 కోట్లు
వెస్ట్ – రూ. 0.20 కోట్లు
గుంటూరు – రూ. 0.43 కోట్లు
నెల్లూరు – రూ. 0.18 కోట్లు
కృష్ణా – రూ. 0.25 కోట్లు