మురుగదాస్ తో పనిచేయడం ట్రెమండస్ జర్నీ

Wednesday,September 27,2017 - 05:07 by Z_CLU

స్పైడర్ సినిమాతో కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. A.R మురుగదాస్ తో పనిచేయడం తన పదేళ్ళ నాటి కల అని బిగినింగ్ నుండే చెప్తున్న మహేష్ బాబు, ఆయన కలిసి పని చేయడం ట్రెమండస్ జర్నీ అని చెప్పుకున్నాడు.

‘ప్రతి డైరెక్టర్ మహేష్ బాబుతో పని చేయాలి’ అని మురుగదాస్ ఇచ్చిన కాంప్లిమెంట్ తన లైఫ్ లో బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పుకున్న మహేష్ బాబు మురుగదాస్ లాంటి డైరెక్టర్ తో పనిచేసే అవకాశం చాలా రేర్ గా వస్తుందని, ఈ ప్రాసెస్ లో చాలా నేర్చుకున్నానని చెప్పుకున్నాడు.

ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజైన స్పైడర్ మూవీ, ప్రతి కార్నర్ నుండి బ్లాక్ బస్టర్ ట్యాగ్ ని బ్యాగ్ లో వేసుకుంటుంది. A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.