#WooAaAhaAha రొమాంటిక్ సాంగ్ అదిరింది

Friday,April 22,2022 - 10:53 by Z_CLU

#WooAaAhaAha Lyrical Song from ‘F3’ out

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో F2 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న F3 నుండి సెకండ్ సింగిల్ రిలీజైంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన WooAaAhaAha అంటూ సాగే ఈ సాంగ్ కి కాసర్ల శ్యామ్ బెస్ట్ లిరిక్స్ అందించాడు. శ్రీనిధి చౌహాన్ సింగింగ్ కూడా సాంగ్ కి ప్లస్ అయింది. తమన్నా , మెహ్రీన్ గ్లామర్ షో తో వచ్చే ఈ సాంగ్ థియేటర్స్ లో కేక పెట్టించడం ఖాయమనిపిస్తుంది.

ఈ సాంగ్ లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హంగామా చేస్తూ భారీ వ్యూస్ కొల్లగొడుతుంది. ఈ సాంగ్ షూట్ టైంలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు గారు అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సెట్స్ విజిట్ చేశారు. ఆ విజువల్స్ కూడా లిరికల్ వీడియోలో యాడ్ చేశారు.

వెంకటేష్ – తమన్నా ,వరుణ్ తేజ్ -మెహ్రీన్ లతో రొమాంటిక్ నంబర్ గా తెరకెక్కిన ఈ సాంగ్ లో సునీల్ రాప్ పడుతూ ఎంటర్టైన్ చేయనున్నాడు. ఓవరాల్ గా F3 నుండి సెకండ్ సింగిల్ గా రిలీజైన WooAaAhaAha ఆకట్టుకుంది. సినిమాలో ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా ? అని ఇప్పటి నుండే ఎదురుచూసేలా ఉంది. ఈ సాంగ్ సినిమాలో హైలైట్ అవ్వబోతుందని గ్లిమ్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఓవరాల్ గా F3 ఆల్బం నుండి వచ్చిన రెండు సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేయడంలో దేవి సక్సెస్ అయ్యాడు.

దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 27న థియేటర్స్ లోకి రాబోతుంది.

WooAaAhaAha Lyrical Video

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics