'ఉమెన్స్ డే' స్పెషల్

Wednesday,March 08,2017 - 09:10 by Z_CLU

ఓ వైపు మేల్ డామినేషన్ ఎక్కువవుతుంటే మేమేం తక్కువ తిన్నామా అంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు స్టార్ హీరోయిన్స్… ఉమెన్స్ డే సందర్భంగా ప్రస్తుతం మహిళా పవర్ తో ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్న సినిమాల పై ఓ లుక్కేద్దాం….

నిజానికి అనుష్క కి లేడీ ఓరియెంటెడ్ సినిమా కొత్తేమి కాదు.. ‘అరుంధతి’ తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కొత్త ఉత్సాహం అందించిన ఈ భామ ఆ తర్వాత కూడా ఈ తరహా సినిమాలతో థియేటర్స్ లోకొచ్చింది. మొన్నా మధ్య పవర్ ఫుల్ ఉమెన్ ‘రుద్రమదేవి’ గా ఆకట్టుకున్న అనుష్క త్వరలోనే ‘భాగమతి’ గా మైథలాజికల్ థ్రిల్లర్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది…

ఇక ‘గీతాంజలి’ వంటి హర్రర్ సస్పెన్స్ థిల్లర్ సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసి సూపర్ హిట్ అందుకున్న అంజలి మరో సారి అలాంటి తరహా లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘చిత్రాంగద’ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది… అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తో మార్చ్ 10 నుంచి థియేటర్స్ లో సందడి చేయబోతుంది అంజలి..


దక్షిణాదిలో మహిళా ప్రధాన చిత్రాలు, ప్రయోగాత్మక కథాంశాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న నయనతార నటించిన లేటెస్ట్ సినిమా డోర. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందిన ఈ సినిమాతో మరో సారి పవర్ ఫుల్ ఉమెన్ గా ఆకట్టుకుని విజయం అందుకోవాలని చూస్తుంది…

ఇక లేటెస్ట్ గా ‘నాయకి’ సినిమాతో పవర్ ఫుల్ లేడి ఓరియెంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయిన త్రిష కూడా త్వరలోనే ‘మోహిని’ అనే మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేయబోతుంది… హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో తెలుగు తమిళ్ భాషల్లో సూపర్ హిట్ అందుకోవాలని చూస్తుంది త్రిష. ఈ సినిమాతో పాటు ‘గర్జనై’ అనే మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమా తో కూడా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలనీ చూస్తుంది…