'వైఫ్ ఆఫ్ రామ్' ట్రైలర్ రిలీజ్

Friday,June 08,2018 - 12:24 by Z_CLU

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’. విజయ్ యెలకంటి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.  మంచు మోహన్ బాబుతో పాటు  రకుల్ ప్రీత్ సింగ్ దర్శకుడు వంశీ కృష్ణ, నిర్మాత స్వప్నదత్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి..ప్రత్యేక  అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డా. మోహన్ బాబు మాట్లాడుతూ ” నా బిడ్డను నమ్మిన నిర్మాతలను అభినందిస్తున్నా.. ఎందుకంటే నేను ట్రైలర్ చూశాను. అద్భుతంగా ఉంది.  నాకు దర్శకుడంటే బాగా ఇష్టం. అతను లేకపోతే సినమాయే లేదు. ఈ మొదటి సినిమా నీకు గొప్ప విజయం సాధించాలి విజయం సాదించాలి” అన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ నేనే ముందు చూశాను. నాకు థ్రిల్లర్ జానరంటే ఇష్టం. విజయ్ కి ఇది తొలి సినిమాలా లేదు. నేను సినిమాలో కొన్ని సీన్స్ కూడా చూశాను.. అవన్నీ చాలా చాలా బావున్నాయి. నాకు బాగా నచ్చాయి.. ఎంటైర్ టీమ్ తో పాటు నా డియరెస్ట్ ఫ్రెండ్ లక్ష్మికి ఆల్ ది బెస్ట్..’ చెప్పింది.

మంచు లక్ష్మి మాట్లాడుతూ :  ప్రొడ్యూసర్ గారు నన్ను పూర్తిగా నమ్మడంతో నాకు ఇంకా బాధ్యత పెరిగింది. మా వర్క్ ను అంతబాగా నమ్మినందుకు విశ్వగారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు. మై రాక్ స్టార్ డైరెక్టర్ విజయ్.. అతను లేకపోతే ఈ సినిమాయే లేదు. రెండుమూడు కథలు అనుకున్నాం. ఫైనల్ గా ఈ కథను ఓకే చేశాం. ఏనాడూ బడ్జెట్ గురించి ఒక్క రూపాయి పెంచమని అడగలేదు. తనే ఓ నిర్మాతగా ఆలోచించి మరీ తెరకెక్కించారు. నువ్వు ఖచ్చితంగా నిర్మాతల దర్శకుడుగా పేరు తెచ్చుకుంటావ్.” అన్నారు.

దర్శకుడు విజయ్ మాట్లాడుతూ : సినిమా గురించి ఆల్రెడీ ట్రైలర్ లో చెప్పాను. కానీ సినిమా గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడను. రిలీజ్ తర్వాత మీరే మాట్లాడతారు. లక్ష్మిగారిని గతంలో ఒకటి రెండు సార్లు మాత్రమే కలిశాను. అయినా నన్ను నమ్మి ఓ ఫ్రెండ్ లా అన్ని విషయాల్లో నాకు హెల్ప్ చేశారు. ఈ సందర్భంగా నా డైరెక్షన్ టీమ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.