విన్నర్ కలెక్షన్స్

Monday,February 27,2017 - 04:10 by Z_CLU

సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తోంది. జగపతిబాబు ఇంపార్టెంట్ రోల్ పోషించిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లోను, హౌజ్ ఫుల్ అనిపించుకుంటూనే, కలెక్షన్ల పరంగా కూాడా బెస్ట్ అనిపించుకుంటోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో కేవలం 3 రోజుల్లో 9 కోట్ల 84 లక్షల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది విన్నర్ మూవీ. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 3 రోజుల్లో ఏకంగా 11 కోట్ల 15 లక్షల రూపాయలు వసూలు చేసింది. లావిష్ ఎంటర్ టైనర్ గా యూత్ ని ఎట్రాక్ట్ చేస్తూనే, ఫాదర్ సెంటిమెంట్ తో ఫ్యామిలీస్ ని థియేటర్లకు రప్పిస్తున్నాడు విన్నర్.

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ ఏడాది రకుల్ కు ఇదే మొదటి సినిమా. నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడు.