టైటిల్ తో సప్రయిజ్ చేస్తాడా?

Sunday,April 19,2020 - 10:01 by Z_CLU

ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తున్నాడట

మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘RRR’నుండి టీజర్ కష్టమే అనిపిస్తుంది. అయితే త్రివిక్రమ్ సినిమా నుండి మాత్రం తారక్ ఫ్యాన్స్ కి ఓ సప్రయిజ్ ఉండబోతుందని తెలుస్తుంది.

అవును… తన 30వ సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయబోతున్నాడు తారక్. ఇటివలే స్క్రిప్ట్ లాక్ అయింది కూడా. RRR షూటింగ్ పూర్తయిన వెంటనే సెట్స్ పైకి వెళ్తుంది.

ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినాకు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన త్రివిక్రమ్ తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేసి బర్త్ డే విషెస్ చెప్పబోతున్నాడట.

ఇప్పటికే దీనికి సంబంధించి వర్క్ జరుగుతుందని టాక్. అయితే ఇది వీడియో ద్వారా అనౌన్స్ చేస్తారా లేదా పోస్టర్ ఏదైనా వదులుతారా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా సప్రయిజ్ అయితే పక్కా అని వినిపిస్తుంది.

హారిక-హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్ ను ఫైనల్ చేయాల్సి ఉంది.