ప్రేమ కథల దర్శకుడు వెంకీతో ఏం చేస్తాడు...?

Thursday,May 09,2019 - 12:02 by Z_CLU

‘వెంకీమామ’ తరవాత విక్టరీ వెంకటేష్ చేయబోయే సినిమా త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లోనే. అయితే రీసెంట్ గా ‘F2’ డైరెక్టర్ అనిల్ రావిపూడి విషయంలో కానీ, ఇప్పుడు సెట్స్ పై ఉన్న దర్శకుడు బాబీ విషయంలో కానీ రేజ్ అవ్వని క్వశ్చన్ ఒకటి.. త్రినాథ రావు నక్కిన విషయంలో రేజ్ అవుతుంది అదేంటంటే.. కరియర్ బిగినింగ్ నుండి ఇప్పటి వరకు ఈ దర్శకుడు చేసినవన్నీ ప్రేమ కథా చిత్రాలే… మరి ఇప్పుడు వెంకీతో ఏం చేయబోతున్నాడు..?

ఇప్పుడు వెంకీతో కూడా లవ్ ఎంటర్టైనరే చేస్తాడా..? గతంలో చేసిన హీరోలంతా యూత్ హీరోలు కాబట్టి పెద్దగా వర్కవుట్ అయి ఉండదేమో కానీ, ఈ సారి వెంకటేష్ కాబట్టి బోనస్ గా కావలసినంత ఎమోషన్స్ కూడా పండించుకునే అవకాశం ఉంది త్రినాథ రావుకి.

నిజానికి ఈ కథను ప్రత్యేకంగా వెంకీ కోసమే రాసుకున్నాడు రచయిత బెజవాడ ప్రసన్న కుమార్. కథ వినీ వినగానే వెంకీ ఇంప్రెస్ అయిపోయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. వెంకీ ఆ స్థాయిలో ఇంప్రెస్ అయ్యాడంటే అనుమానమే లేదు సినిమాలో కావాల్సినన్నీ మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయనే అర్థం… ఇంతేనా ఈ సినిమా విషయంలో ఇంకో ఎగ్జైటింగ్ ఎలిమెంట్ ఉండే అవకాశం కూడా ఉంది.

ఇంకా అఫీషియల్ గా కన్ఫమ్ కాలేదు కానీ ఈ సినిమాలో వెంకీ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తాడనే టాక్ ఒకటి గట్టిగా వినిపిస్తుంది. ఇది గనక నిజమైతే ప్రేమ కథా చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన, బౌండరీ దాటి మాస్ సినిమాని తెరకెక్కించే సూచనలైతే కనిపిస్తున్నాయి.