నాని కి అది ప్లస్ అవుతుందా?

Monday,September 19,2016 - 04:49 by Z_CLU

‘భలే భలే మగాడివోయ్’ , ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘జెంటిల్ మన్’ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని మరో సినిమాతో సిద్దమయ్యాడు. ‘ఉయ్యాల- జంపాల ‘ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం లో నాని నటించిన తాజా చిత్రం ‘మజ్ను’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ శుక్ర వారం ప్రేక్షకుల ముందుకురానుంది.

     అయితే ఈ సినిమాకు సంబంధించి నాని కి ఓ సెంటిమెంట్ కలిసొచ్చేలా ఉందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అదేమిటంటే అక్కినేని నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచిన చిత్రం ‘మజ్ను’ ఇప్పుడు ఇదే టైటిల్ తో రానున్న ‘మజ్ను’ కూడా నాని కెరీర్ లో ఓ హిట్ గా నిలుస్తుందా? ముందుగా నాగ చైతన్య నటిస్తున్న ప్రేమమ్ సినిమాకు ఈ టైటిల్ అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మలయాళ టైటిల్ నే ఖరారు చేశారు. దీంతో మజ్ను టైటిల్ నానికే దక్కింది. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన నాని, మజ్నుతో మరో సక్సెస్ అందుకుంటాడని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలకు ఇప్పుడు టైటిల్ సెంటిమెంట్ కూడా తోడయింది.