రీమేక్ క్వీన్ అనిపించుకుంటుందా ?

Tuesday,March 19,2019 - 02:22 by Z_CLU

వరుసగా రీమేక్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది సమంత. ఈ తొమ్మిదేళ్ళల్లో తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది కానీ… రీమేక్స్ కి ప్రాదాన్యం ఇవ్వలేదు..  ప్రస్తుతం వరుసగా రీమేక్ సినిమాలు ఎంచుకుంటుంది. ఇటివలే కన్నడ ‘యూ టర్న్’ ను తెలుగు, తమిళ్ లో రీమేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నందినీ రెడ్డి డైరెక్షన్ లో ‘ఓ బేబీ’ సినిమా చేస్తోంది. ఇది కొరియన్ సినిమాకు రీమేక్.

ఈ రెండే కాదు లేటెస్ట్ గా తెలుగులో మరో రీమేక్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సామ్. తమిళ్ లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం అందుకున్న ’96’ నటించనుంది. ఈ సినిమాలో త్రిష క్యారెక్టర్ ప్లే చేయబోతుంది.. ఈ సినిమాతో సామ్ రీమేక్ లిస్టు పెరగనుంది. మరి  బ్యాక్ టు బ్యాక్ రీమేక్ సినిమాలతో సమంత తెలుగులో రీమేక్ క్వీన్ అనిపించుకుంటుందా..? చూడాలి.