దిల్ రాజుకు రామ్ చరణ్ ఆ ఛాన్స్ ఇస్తాడా?

Wednesday,June 05,2019 - 12:03 by Z_CLU

దిల్ రాజు బ్యానర్ లో చేయని స్టార్ హీరో అంటూ లేడు. అంతెందుకు ఏ స్టార్ జస్ట్ ఒక్క సినిమా చేసి పక్కకు వెళ్ళిపోయాడు అనేది కూడా లేదు. మ్యాగ్జిమం హీరోలు రిపీటెడ్ గా చేసిన వాళ్ళే… ఒక్క రామ్ చరణ్ తప్ప… అప్పుడెపుడో ‘ఎవడు’ చేసి మళ్ళీ చెర్రీ తో సినిమా చేయలేదు దిల్ రాజు. ఇంతకీ మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ కుదిరేదెప్పుడు..?

 

అల్లు అర్జున్ :  రీసెంట్ గా అనౌన్స్ అయిన ‘ఐకాన్’ సెట్స్ పైకి వస్తే బన్ని దిల్ రాజుతో ఏకంగా 5  సినిమాలు చేసినట్టు.. ఇప్పటికే ఆర్య, పరుగు, ఎవడు, DJ సినిమాలు చేసి దిల్ రాజు బంనికి మోస్ట్ ఫేవరేట్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. ‘ఐకాన్’ తరవాత మళ్ళీ ఓ మంచి కాన్సెప్ట్ తో వెళ్ళాలి కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తూనే ఉంటాయి.

మహేష్ బాబు : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో స్టార్ట్ అయింది వీళ్ళిద్దరి ప్రొఫెషనల్ రిలేషన్ షిప్. ఆ తరవాత రీసెంట్ గా మహర్షి తో మరింత బలపడింది. ఇప్పుడు మళ్ళీ ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ అదే బ్యానర్ లో మూడో సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్.

NTR: NTR ని శ్రీకృష్ణుడిలా చూపించాలనే కలని బృందావనం తో తీర్చుకున్నాడు దిల్ రాజు. ఈ సినిమా తరవాత ఈ కాంబినేషన్ లో ‘రామయ్యా వస్తావయ్య’ వచ్చింది.

 

ప్రభాస్ : మున్నా సినిమా చేశాడు. ఆ తరవాత మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేశాడు ప్రభాస్. ఈ సినిమా కోసం దిల్ రాజు ప్రత్యేకంగా ప్రభాస్ కోసం కథ కూడా రాసుకున్నాడు.

రవితేజ : ‘భద్ర’ సినిమా తరవాత రీసెంట్ గా ‘రాజా ది గ్రేట్’ చేసి తను కూడా రిపీట్ చేశాను అనుకున్నాడు రవితేజ. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే సూపర్ హిట్టే అనేంతలా ఈ కాంబో ఒపీనియన్ క్రియేట్ చేసింది.

ఇలా చెప్పుకుంటూ పోతే నితిన్, నాని, శర్వానంద్, రామ్ పోతినేని, వరుణ్ తేజ్… అంతెందుకు సీనియర్ హీరో వెంకటేష్ కూడా దిల్ రాజు బ్యానర్ లో సినిమాలు రిపీటెడ్ గా చేశారు. మరి రామ్ చరణ్ దిల్ రాజుకి ఆ అవకాశం ఎప్పుడు ఇస్తాడో చూడాలి…