#PushpaTheRise - చెప్పిన డేట్ కే వస్తుందా?

Sunday,August 29,2021 - 12:41 by Z_CLU

ప్రస్తుతం ప్రకటించిన రిలీజ్ డేట్ కి బడా సినిమాలు రిలీజ్ అవుతాయా? అనే డైలామా కొనసాగుతుంది. అందులో Pushpa The Rise ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ తో పాటు ఫస్ట్ సింగిల్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ సినిమాను ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ అంటూ ప్రకటించారు. అయితే ప్రకటించినట్టే ఆ డేట్ కి సినిమా వస్తుందా ? అనే ప్రశ్న ఇటు బన్నీ ఫ్యాన్స్ లో అటు ఆడియన్స్ లోనూ ఉంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాను కచ్చితంగా ప్రకటించిన డేట్ కి రిలీజ్ చేసేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయింది. మరో ఇరవై రోజులు మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉంది. సెప్టెంబర్ 3న మళ్లీ మరేడుమిల్లి వెళ్లనున్నారు యూనిట్. అక్కడ బన్నీ, ఫహాద్ ఫాజిల్ లపై కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లో సాంగ్ తో టోటల్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పనున్నారు.

ఫహాద్ ఫాజిల్ సినిమాలో IPS ఆఫీసర్ గా కనిపించనున్నాడు. పార్ట్ లో ఫహాద్  రోల్ చాలా చిన్నదే అని తెలుస్తుంది. కానీ రెండో భాగంలో అతని పాత్ర చాలా కీలకంగా ఉండనుందని ఇన్ సైడ్ టాక్. మొదటి భాగంలో ఫహాద్ పాజిటివ్ యాంగిల్ లో కనిపిస్తాడని ఆ తర్వాత రెండో భాగంలో పూర్తిగా నెగిటివ్ రోల్ లో కనిపిస్తాడని సమాచారం. ఇక పార్ట్ 1 ఎండింగ్ కి సుకుమార్ గట్టి ట్విస్ట్ ప్లాన్ చేశాడని, అది పార్ట్ 2 పై ఆసక్తి కలిగిస్తుందని తెలుస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా నుండి రెండో సింగిల్ త్వరలోనే విడుదల కానుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics