Prabhas : టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే

Thursday,August 20,2020 - 03:01 by Z_CLU

 

బాహుబలి ప్రాంచైజీ కోసం ఏకంగా ఐదేళ్ళు కేటాయించి కొన్నేళ్ళు స్క్రీన్ కి దూరమై ఫ్యాన్స్ ని వెయిట్ చేయించాడు Prabhas ఆ తర్వాత సాహో కోసం కూడా ఓ ఏడాది గ్యాప్ ఇచ్చాడు. అయితే ఏడాదికి ఒక సినిమాతో ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆ ప్లాన్ లో భాగంగానే ఏడాదికో సినిమా అంటూ అనౌన్స్ చేసాడు. అంతవరకూ బాగానే ఉంది కానీ ప్రభాస్ లేటెస్ట్ అనౌన్స్ మెంట్స్ చూస్తుంటే అనుకున్న టైం కి సినిమాలు థియేటర్స్ లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

Prabhas-NagAshwin మూవీ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది చివరి కల్లా థియేటర్స్ లోకి తీసుకొస్తామని తెలిపారు. ఇక లేటెస్ట్ గా Prabhas-Adipurush ఎనౌన్స్ చేశారు. 2022రిలీజ్ అంటూ తెలిపారు. అంటే భారీ ప్రాజెక్ట్స్ ను ఏడాది గ్యాప్ లోనే రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు ప్రభాస్.

కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే అనిపిస్తుంది.

ప్రభాస్ ‘Radheshyam’ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అది పూర్తయ్యాకే నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అంటే వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా స్టార్ట్ అవ్వొచ్చు. ఎలాగూ నాగ్ అశ్విన్ మేకింగ్ కి ఎక్కువ టైం తీసుకుంటాడు. సో Prabhas21 మేకర్స్ అనుకున్నట్లు వచ్చే ఏడాది ఎండింగ్ లో రిలీజ్ కష్టమే.

అలాగే రామాయణంలోని ప్రముఖ ఘట్టాలతో తెరకెక్కనున్న ‘ఆదిపురుష్’ ఏడాదిలో షూట్ చేయడం చేయడం కష్టమే. ఎటు లేదన్నా రెండేళ్ళు పట్టొచ్చు. మరి ఈ లెక్కన చూస్తే ప్రభాస్ నెక్స్ట్ సినిమాలు అనుకున్న టైమ్ కు రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదనిపిస్తుంది.