మెగా ట్రెండ్ ఫాలో అవుతాడా...?

Tuesday,February 21,2017 - 10:40 by Z_CLU

పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈనెలాఖరుకు లేదా వచ్చేనెల మొదటివారానికి షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. మార్చి ఎండింగ్ కు సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుంది. మరి ఆడియో సంగతేంటి…? పాటల వేడుక ఉంటుందా ఉండదా…? పవన్ సినిమాకు ఆడియో ఫంక్షన్ పెడతారా.. లేక మెగా ట్రెండ్ ను ఫాలో అవుతారా…?

మెగా కాంపౌండ్ లో హీరోలెవరూ ఈమధ్య ఆడియో ఫంక్షన్లు చేయడం లేదు. తమ సినిమాలకు సంబంధించిన పాటల్ని దశలవారీగాా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. అలా సినిమాపై హైప్ క్రియేట్ చేసిన తర్వాత ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెడుతున్నారు. తర్వాత మూవీని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ వరకు అంతా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మరి పవన్ సంగతేంటి…?

తాజా సమాచారం ప్రకారం… పవన్ కూడా తన సినిమా పాటల్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. ఎందుకంటే, ప్రస్తుతం పవర్ స్టార్ బిజీగాా ఉన్నారు. ఓవైపు రాజకీయ వ్యవహారాలు చూస్తూనే, మరోవైపు షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇంత బిజీ టైమ్ లో ఆడియో ఫంక్షన్ పెట్టేకంటే, సోషల్ మీడియాలో విడతల వారీగాా సాంగ్స్ రిలీజ్ చేయడమే బెస్ట్ అని భావిస్తున్నాడట.