పవన్ కల్యాణ్ మరో సినిమా చేస్తాడా..?

Saturday,March 10,2018 - 10:38 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్ కమింగ్ ప్రాజెక్టుపై రోజుకో పుకారు షికారు చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ హీరో ఓ సినిమా చేయబోతున్నాడని, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోందని ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత..?

లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ప్రస్తుతానికి సినిమాలపై పవన్ కు ఇంట్రెస్ట్ లేదు. పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిపెట్టిన ఈ హీరో.. ఆ దిశగానే తన ఆలోచన చేస్తున్నాడు తప్ప సినిమాల గురించి ఆలోచించడం లేదు. ఇదే విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కూడా చెప్పేశాడు.

కానీ పవన్ మాత్రం మరో సినిమా చేస్తాడంటూ పుకార్లు వస్తూనే ఉన్నాయి. పవర్ స్టార్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి. ఈ మూవీ రిలీజ్ తన నెక్ట్స్ సినిమాపై ఎలాంటి ప్రకటన చేయలేదు పవన్.