ఈసారి హిట్ కొడతాడా..?

Monday,October 17,2016 - 12:48 by Z_CLU

సరికొత్త ప్రయోగాత్మక సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మరో ప్రయోగాత్మక సినిమాతో రెడీ అయ్యాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అనే టైటిల్ తో ప్రేక్షకులను అలరించాడనికి నవంబర్ 11 న థియేటర్స్ కి రాబోతున్నాడు.

        వి.ఐ. ఆనంద్ డైరెక్షన్ లో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ తోనే అందరినీ ఎట్రాక్ట్ చేసిన నిఖిల్ తాజాగా టీజర్ తో మరిన్ని అంచనాలు పెంచేశాడు. ఇటీవలే ‘కార్తికేయ’ వంటి థ్రిల్లర్ సినిమాతో అలరించి మంచి విజయం అందుకున్న ఈ యంగ్ హీరో మరో సారి అలాంటి థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ తో సిద్దమవుతున్నాడు. మరి ప్రస్తుతం ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తూ విజయాలు అందుకుంటున్న నిఖిల్ ఈ సినిమాతో ఎలాంటి విజయం అందుకుంటాడో? తెలియాలంటే నవంబర్ 11 వరకు ఆగాల్సిందే….