నాగార్జున ఆ సీక్వెల్ ను పక్కన పెట్టినట్టేనా?

Wednesday,July 29,2020 - 07:36 by Z_CLU

ప్రస్తుతం మెగాఫోన్ పట్టిన రైటర్ సోల్మాన్ తో ‘వైల్డ్ డాగ్’ సినిమా చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ‘సోగ్గాడు చిన్ని నాయన’ కు సీక్వెల్ గా ‘బంగార్రాజు’ సినిమా చేస్తాడని అందరు భావించారు. చాలా నెలలుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమానే తన నెక్స్ట్ అంటూ కొన్ని సందర్భాల్లో చెప్పాడు నాగ్. కళ్యాణ్ కృష్ణ ఫైనల్ స్క్రిప్ట్ తో వచ్చే రోజు కోసం వెయిటింగ్ అంటూ తెలిపాడు కూడా. కట్ చేస్తే ఇప్పుడు ప్రవీణ్ సత్తారు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు కింగ్.

దీంతో నాగ్ ‘బంగార్రాజు’ సినిమాను పక్కన పెట్టినట్టే అనే ప్రచారం జరుగుతుంది. నిజానికి ‘సోగ్గాడే చిన్ని నాయన’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన వెంటనే ఈ సీక్వెల్ ను ప్రకటించారు. కానీ ఇంత వరకు కార్య రూపం దాల్చలేదు. మరి ప్రవీణ్ సత్తారు సినిమా తర్వాతయినా నాగ్ ఈ సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకొస్తాడేమో చూడాలి.