కీర్తి కి ఈసారి కూడా కలిసోస్తుందా...?

Sunday,January 07,2018 - 01:20 by Z_CLU

తెలుగు లో నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ సాధించడంతో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేష్. రామ్ హీరోగా తెరక్కిన ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసుకొని సూపర్ హిట్ అందుకుంది.

లేటెస్ట్ గా నాని సరసన ‘నేను లోకల్’ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో రెండో సూపర్ హిట్ అందుకుంది. ఇలా అమ్మడు నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పడు కీర్తి అజ్ఞాతవాసి తో హాట్రిక్ అందుకునే పనిలో పడింది.

రిలీజ్ కి ముందే పాజిటీవ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న ‘అజ్ఞాతవాసి’ కనుక బ్లాక్ బస్టర్ సాధిస్తే కీర్తి కి టాలీవుడ్ లో లక్కీ బ్యూటీ అనే టైటిల్ తో పాటు వరుస ఆఫర్స్ క్యూ కడతాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఈ సినిమాతో కీర్తి హ్యాట్రిక్ హిట్ కొడితే ‘మహానటి’ పై అంచనాలు భారీగా పెరుగిపోతాయనడంలో సందేహం లేదు.