జెర్సీ కాంబినేషన్ రిపీట్ అవుతుందా!

Tuesday,July 14,2020 - 12:27 by Z_CLU

నేచురల్ స్టార్ నాని కెరీర్ లో మోస్ట్ మెమొరబుల్ మూవీ జెర్సీ. తన కెరీర్ లో ఇంత హై-ఎమోషనల్ మూవీ చేయలేదని నాని స్వయంగా చెప్పుకొచ్చాడు. కేవలం నాని కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పైనే హై-ఎమోషనల్ మూవీస్ లో జెర్సీ ఒకటి.

మళ్లీ ఇన్నాళ్లకు జెర్సీ కాంబినేషన్ డిస్కషన్ లోకి వచ్చింది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరక్షన్ లో మరోసారి నటించేందుకు నాని రెడీ అవుతున్నాడు. వీళ్లిద్దరి మధ్య మరో మంచి స్టోరీకి సంబంధించి డిస్కషన్స్ జరిగాయట.

ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి జెర్సీ హిందీ రీమేక్ తో బిజీగా ఉన్నాడు. ఇటు నాని కూడా టక్ జగదీశ్, శ్యామ్ సింగరాయ్ మూవీస్ తో బిజీ. వీళ్ల కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత ఈ కాంబోపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.