హన్సిక మ్యాజిక్ టచ్ కలిసొస్తుందా...?

Thursday,March 29,2018 - 02:15 by Z_CLU

తెలుగులో ఆపిల్ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువే. కానీ ఇక్కడ ఆమె సక్సెస్ రేట్ మాత్రం ఎక్కువ. ఆమె చేసిన సినిమాలు ఆల్ మోస్ట్ ఇక్కడ హిట్ అయినవే. ఇదే సెంటిమెంట్ తో వస్తోంది గులేబకావళి. హన్సికకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్, ప్రభుదేవాకు ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 6న థియేటర్లలోకి వస్తోంది ఈ మూవీ.

రీసెంట్ గా లక్కున్నోడు, గౌతమ్ నంద లాంటి సినిమాల్లో నటించిన హన్సిక ఇప్పుడు గులేబకావళి సినిమాతో మెస్మరైజ్ చేయనుంది. ప్రభుదేవా ఉన్నాడు కాబట్టి డాన్స్, ఎంటర్ టైన్ మెంట్ కు ఢోకా లేదు. ఇక గ్లామర్ పరంగా హన్సిక ఉండనే ఉంది. అందుకే ఈ సినిమా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజైన ట్రయిలర్ క్లిక్ అవ్వడంతో సినిమాపై ఇంట్రెస్ట్ ఇంకాస్త పెరిగింది.

 

 

గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా. దీనికి కాస్త దెయ్యం యాంగిల్ కూడా జోడించారు. గతంలో ఇలాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మరకతమణి సినిమా తెలుగులో హిట్టయింది. సో.. అదే జానర్ లో వస్తున్న గులేబకావళి కూడా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉంది యూనిట్. సీనియర్ నటి రేవతి  ఇందులో ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు.