బన్నీ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా...

Tuesday,February 14,2017 - 09:45 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ బలమైన సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. తనకి కలిసొచ్చిన ఓ డేట్ ను తన నెక్స్ట్ సినిమా ప్రమోషన్ కోసం ఇప్పటికే లాక్ చేసుకున్నాడు కూడా. బన్నీ లక్కీగా ఫీలవుతున్న ఆ డేట్ ఫిబ్రవరి 18.

లాస్ట్ ఇయర్ ఈ డేట్ కి ‘సరైనోడు’ సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన బన్నీ… ఇప్పుడు అదే డేట్ కి తన లేటెస్ట్ సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. సరిగ్గా ఏడాది కిందట ఇదే డేట్ కి రిలీజ్ చేసిన ‘సరైనోడు’ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పైగా విడుదలైన తర్వాత ఆ సినిమా గ్రాండ్ హిట్ సాధించి.. బన్నీ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. దీంతో ఈ డేట్ ను లక్కీగా ఫీల్ అవుతున్నాడు స్టైలిష్ స్టార్. అందుకే హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న డీజే ఫస్ట్ లుక్ ను ఈనెల 18న విడుదల చేయాలని అనుకుంటున్నాడు.

డీజేపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. బన్నీ ఇందులో డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ డైరక్టర్. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ మూవీ… దిల్ రాజుకు నిర్మాతగా 25వ సినిమా కావడం విశేషం.

dj