చైతూకు కలిసొచ్చింది.. అఖిల్ పరిస్థితేంటి?

Tuesday,February 19,2019 - 12:38 by Z_CLU

గీతాఆర్ట్స్.. ఈ బ్యానర్ కేవలం చిరంజీవికే కాదు, ఎంతోమంది మెగాహీరోలకు హిట్స్ ఇచ్చింది. ఇదే బ్యానర్ పై అక్కినేని హీరో నాగచైతన్య కూడా హండ్రెండ్ పర్సెంట్ లవ్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై నాని లాంటి హీరోలు కూడా హిట్స్ కొట్టారు. అలాంటి సూపర్ హిట్ బ్యానర్ పై ఇప్పుడు అఖిల్ సినిమా చేయబోతున్నాడు.

అవును.. అఖిల్ తన నెక్ట్స్ మూవీని గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై చేయబోతున్నాడు. అన్నయ్య నాగచైతన్య సక్సెస్ కొట్టినట్టే సెంటిమెంట్ పరంగా తను కూడా ఓ మంచి హిట్ కొట్టాలనుకుంటున్నాడు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా దర్శకుడు ఎవరనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు.

ప్రస్తుతం గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఇద్దరు దర్శకులు పెండింగ్ లో ఉన్నారు. వాళ్లలో ఒకరు గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరశురాం కాగా, మరొకరు బొమ్మరిల్లు భాస్కర్. వీళ్లలో ఎవరితో అఖిల్ సినిమా ఉంటుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. దర్శకుడు ఎవరైనప్పటికీ ఈ బ్యానర్ మాత్రం సెంటిమెంట్ పరంగా తనకు హిట్ ఇస్తుందని అఖిల్ ఆశతో ఉన్నాడు.