స్పెషల్ సాంగ్స్ చేయడానికి రీజన్ అదే

Wednesday,June 10,2020 - 04:22 by Z_CLU

తమన్నకు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు, తమిళ భాషల్లోనే కాదు, బాలీవుడ్ లో కూడా ఆమెకు క్రేజ్ ఉంది. మరి ఇంత పాపులారిటీ పెట్టుకొని ఆమె ఎందుకు స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. దీనిపై మిల్కీబ్యూటీ రియాక్ట్ అయింది.

“నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇదే విషయం అడిగారు. అందరికీ నేను చెప్పేది ఒకటే. నాకు డాన్స్, మ్యూజిక్ అంటే ఇష్టం. నన్ను ఫాలో అయ్యేవాళ్లందరికీ తెలుసు నాకు డాన్స్ అంటే ఎంతిష్టమో. ఎప్పుడు ఓ స్పెషల్ సాంగ్ వచ్చినా నా డాన్స్ చూపించడానికి దాన్నొక అవకాశంగా భావిస్తాను. అది నాకు ఇష్టం. పైగా గతంలో నేను వర్క్ చేసిన హీరోలతోనే చాలా స్పెషల్ సాంగ్స్ చేశాను. వాళ్లతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా బాగుంటుంది. స్పెషల్ సాంగ్స్ చేయడంలో నాకు ఎలాంటి ఇబ్బందులు, అభ్యంతరాలు లేవు.”

ఇలా స్పెషల్ సాంగ్స్ పై తన ఒపీనియర్ బయటపెట్టింది తమన్న. ఇకపై కూడా ప్రత్యేక గీతాల్లో నటిస్తానని, తన నుంచి ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారని అంటోంది. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంటికే పరిమితమైపోయిన తమన్న.. ఆవకాయ్ పెట్టడం నేర్చుకుందట.