బిగ్ బితో జక్కన్న మంతనాలు..?

Friday,October 28,2016 - 01:03 by Z_CLU

బాహుబలి 2 కి ఇంకా ప్యాకప్ కూడా చెప్పలేదు. అపుడే జక్కన్న తన నెక్ట్స్ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టేశాడా…? ఇంకా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియనే లేదు.. ఈ లోపు రాజమౌళి తరవాతి సినిమా పనులు షురూ చేశాడా…? ఇలాంటి ప్రశ్నలెన్నో సోషల్ మీడియాలో హీట్ జనరేట్ చేస్తున్నాయి. దీనికి కారణం రాజమౌళి.. బిగ్ బిని కలవడమే. ఇద్దరివీ ఊపిరి తీసుకోవడానికి కూడా వీలులేనంత బిజీ షెడ్యూల్స్. అలాంటి పరిస్థితుల్లోనూ రాజమౌళి బిగ్ బి ని కలుసుకోవడం కొత్త రూమర్స్ కి శంకుస్థాపన చేసింది.

cvyafejueayo6uu

రాజమౌళి తన నెక్ట్స్ సినిమాని బాలీవుడ్ స్టార్స్ తో ప్లాన్ చేస్తున్నాడా..? ఆ విషయం మాట్లాడటానికే బిగ్ బి ని కలుసుకున్నాడా..? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో తాండవం చేస్తున్నాయి. బాహుబలి రిలీజ్ అయినప్పుడు పర్సనల్ గా అభినందనలు తెలిపిన అమితాబ్ బచ్చన్ కి రాజమౌళి అంటే ప్రత్యేక అభిమానం ఉంది. మరి ఆ అభిమానం, ఇప్పుడీ మీటింగ్…. ఎటువైపు దారితీస్తాయో చూడాలి.