కొరటాలకి ఈ ఆలోచన ఎందుకు రాలేదు..?

Thursday,March 14,2019 - 10:02 by Z_CLU

స్టార్ హీరోలు బిజీగా ఉన్నారు…. స్టార్ డైరెక్టర్స్ కూడా బిజీగా ఉన్నారు. ఒక్క కొరటాల శివ తప్ప. ఇంకో నెల గడిస్తే భరత్ అనే నేను’ సినిమా రిలీజై ఖచ్చితంగా ఏడాది’. ఆ సినిమా తరవాత హీరో మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమాతో బిజీ అయిపోయాడు, కానీ దర్శకుడు కొరటాల శివ సినిమా మాత్రం ఇంకా సెట్స్ పైకే రాలేదు. ఈ గ్యాప్ లో శివ చేసిందేమైనా ఉంటే, అది మెగాస్టార్ ని సినిమాకి కన్విన్స్ చేసుకోవడమే…

మెగాస్టార్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమనేది చిన్న విషయం కాదు డెఫ్ఫినెట్ గా అచీవ్ మెంటే. అంత మాత్రాన గ్యాప్ తీసుకోవాలా..? ‘సైరా’ సినిమా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నది ఫస్ట్ నుండి తెలిసిందే. మరలాంటప్పుడు కొరటాల శివ ఇంకో స్టార్ తో సినిమా చేసేసుకోవచ్చుగా…? ఈ ఆలోచన ఆయనకకి నిజంగానే రాలేదా…?

ఫస్ట్ సినిమా ‘మిర్చి’ తరవాత ఓ ఏడాది గ్యాప్ వచ్చింది కానీ ఆ తరవాత కొరటాల ఒక్క ఏడాది కూడా సినిమా లేకుండా దాటనివ్వలేదు. కానీ కొరటాల రిలాక్స్ అవ్వడం చూస్తుంటే 2019 కొరటాల సినిమా లేకుండానే దాటేస్తుందనిపిస్తుంది. అలాగని తొందరపడి ఏదోలా డిసైడ్ అయ్యి ఏదో స్టార్ తో సినిమాని సెట్స్ పైకి వచ్చేశాడనుకోండి, ఇక్కడ ఇంకో ముప్పుపొంచి ఉంది.

ఇప్పుడు అక్టోబర్ లో ‘సైరా’ రిలీజనుకుంటే, మెగాస్టార్ అప్పటి వరకు షూటింగ్ చేస్తూనే ఉంటాడని కాదు కదా. గ్రాఫిక్స్, రిలీజ్ ఫార్మాలిటీస్ వగైరా వగైరా.. వాటితో చిరుకి సంబంధం లేదు. ఈ వరసలో క్యాలిక్యులేషన్ తప్పి, ఉన్నపళంగా ‘శివ’ సినిమా చేసేద్దాం అంటే, కొరటాల రెడీగా ఉండాలి కదా… అందుకే అన్ని రకాలుగా ఆలోచించి రిస్క్ చేయడం కన్నా వెయిట్ చేయడం బెటర్ అని ఫిక్సయి అయినట్టున్నాడు కొరటాల.