పూరి నెక్స్ట్ హీరో ఎవరు ..?

Sunday,July 28,2019 - 04:02 by Z_CLU

పూరి జగన్నాథ్ హీరో అంటే ఆడియన్స్ కి కొంచెం స్పెషల్. ‘బద్రి’ నుండి ఇటివలే వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ వరకూ ప్రతీ హీరోని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసి మెస్మరైజ్ చేసాడు పూరి. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ ను మాస్ హీరోగా ప్రెజెంట్ చేసి బ్లాక్ బస్టర్ అందించిన పూరి నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తాడా..? అనే క్యూరియాసిటీ మొదలైంది.

అయితే మళ్ళీ ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ లాంటి సినిమా చేయాలనుందని, ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని నెక్స్ట్ చేసే సినిమా అదే ఉండొచ్చని చెప్పుకొచ్చాడు పూరి. మరో వైపు ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే కథను కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడు.

అయితే పూరి సాయి ధరం తేజ్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. మరో వైపు రామ్ చరణ్ పేరు కూడా వినబడుతుంది. సో పూరి ఎవరితో సినిమా చేస్తాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. మరి పూరి నెక్స్ట్ హీరో ఎవరన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.