యంగ్ డైరెక్టర్ నెక్స్ట్ ఎవరితో..?

Wednesday,May 15,2019 - 11:03 by Z_CLU

‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ రాజశేఖర్ హీరోగా ‘కల్కి’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ చూసి కొంత మంది హీరోలు ప్రశాంత్ వర్మని స్క్రిప్ట్స్ వినిపించమన్నారట. ఈ లిస్టులో చైతూ, నాని, శర్వానంద్ తో పాటు రవితేజ కూడా ఉన్నాడని తెలుస్తోంది.

ఇక అ! సినిమాతో ప్రశాంత్ వర్మ క్రియేటివిటీ ఏంటో..అతని మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. కాకపోతే అదొక ప్రయోగాత్మక సినిమా.  అందుకే రెండో సినిమాకి పక్కా కమర్షియల్ కథ ఎంచుకున్నాడు ప్రశాంత్. ‘కల్కి’ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అయినప్పటికీ యాక్షన్ ఎపిసోడ్స్, కామెడీ, ప్రేక్షకులు థ్రిల్ అయ్యే ఎలిమెంట్స్ అన్ని ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.

  ఈ సినిమాతో హిట్ అందుకొని చకచకా సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. కథలు విన్న హీరోలు కూడా ‘కల్కి’ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమా ఎవరితో  చేస్తాడన్నది తెలియాలంటే ‘కల్కి’ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.