D&D ఆ పాత్రలెవరు చేస్తారు ?

Tuesday,November 24,2020 - 01:34 by Z_CLU

Vishnu Manchu , Sreenu Vaitla మరోసారి కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 13 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో రానున్న D&D సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంటుంది. అయితే ఇది గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ” సినిమాకు సీక్వెల్ అని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడీ సినిమాలో డా. శ్రీహరి , జయప్రకాశ్ రెడ్డి చేసిన కీలక పాత్రలు ఎవరితో చేయిస్తారా అనే డిస్కషన్ నడుస్తుంది.

అవును ‘డీ’ లో శ్రీహరి క్యారెక్టర్ తో పాటు జయప్రకాశ్ రెడ్డి పాత్ర కూడా థియేటర్స్ లో అందరికీ నవ్వు తెప్పించి ఎంటర్టైన్ చేసింది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు నటులు స్వర్గస్తులయ్యారు. దీంతో ఈ సీక్వెల్ లో ఆ రోల్స్ ను శ్రీను వైట్ల ఏ నటులతో చేయిస్తాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

నిజానికి D&D సినిమా ‘డీ’ కి సీక్వెల్ అయినప్పటికీ అదే కథతో అవే పాత్రలతో ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఇది ఎంటర్టైన్ మెంట్ తో కూడిన అలాంటి మరో కథ అనుకోవచ్చు. ఇద్దరూ కలిసి మళ్ళీ సినిమా చేస్తున్నారు కాబట్టి హైప్ క్రియేట్ చేయడం కోసం సీక్వెల్ అని చెప్తున్నారు కావొచ్చు. ఏదేమైనా డీ లో శ్రీను వైట్ల క్రియేట్ చేసి నవ్వించిన పాత్రలు ఇందులో కూడా క్రియేట్ చేసి మళ్ళీ అదే స్థాయిలో నవ్వించగలిగితే దర్శకుడిగా మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కినట్టే.

Also Check : శ్రీను వైట్ల , మంచు విష్ణు కాంబో ఫిక్స్ !

అల్లు సపోర్ట్ తీసుకున్న విష్ణు మంచు