రామ్ లిస్టులో మరో డైరెక్టర్ ?

Friday,February 12,2021 - 03:30 by Z_CLU

హీరో రామ్ ‘రెడ్’ సినిమా వచ్చి సరిగ్గా నెల రోజులవుతుంది. ఇంత వరకు తన నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది మాత్రం ఎనౌన్స్ చేయలేదు రామ్. ప్రస్తుతం  రామ్ కొంత మంది దర్శకులను ఫైనల్ చేసుకున్నాడు. అందులో తమిళ్ దర్శకుడు నేసన్ , వెంకీ కుడుముల , అనిల్ రావిపూడితో పాటు త్రివిక్రమ్ కూడా ఉన్నారు. అయితే ఈ లిస్టులోకి తాజాగా లింగు స్వామి కూడా చేరాడట.

ఇటివలే రామ్ ను కలిసి లింగుస్వామి ఓ మాస్ కథ వినిపించాడని సమాచారం. రామ్ కూడా ఈ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఇప్పటికే నేసన్ సినిమా ఓకె చేసేసుకొని త్వరలోనే ఆ సినిమాను పట్టాలెక్కించబోతున్న రామ్ మళ్ళీ తన ప్లానింగ్ మార్చుకొని ముందుగా లింగుస్వామికి ఛాన్స్ ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ ఇద్దరు తమిళ్ డైరెక్టర్స్ లో రామ్ నెక్స్ట్ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారనేది కొన్ని రోజుల్లో తేలనుంది.