నయనతార, విద్యాబాలన్, త్రిష, అనుష్క.. ఎవరికి ఓటు?

Sunday,January 27,2019 - 12:10 by Z_CLU

సైరా సినిమా షూటింగ్ స్వింగ్ లో ఉన్నప్పటికీ ఈ మూవీతో పాటు చిరంజీవి చేయబోయే నెక్ట్స్ సినిమాపై కూడా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా చిరు-కొరటాల సినిమాలో హీరోయిన్ ఎవరైతే బాగుంటుందే చర్చ జోరుగా సాగుతోంది

చిరు-నయన్
వీళ్ల కాంబినేషన్ లోనే ఇప్పుడు సైరా తెరకెక్కుతోంది. పెయిర్ బాగుంటుంది. మెగాస్టార్ మరో ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

చిరు-త్రిష
వీళ్లిద్దరూ కలిసి ఇప్పటికే ఓ సినిమా చేశారు. మరో సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా వెయిటింగ్. అభిమానుల సంగతి పక్కనపెడితే, మెగాస్టార్ సరసన ఛాన్స్ అంటే మాత్రం త్రిష ఎగిరి గంతేయడం ఖాయం.

చిరు-విద్యాబాలన్
ఎన్టీఆర్ బయోపిక్ లో నటించిన విద్యాబాలన్, చిరు-కొరటాల సినిమాకు వన్ ఆఫ్ ది ఆప్షన్స్ గా నిలిచింది. ఈమె నటిస్తే ఈ ప్రాజెక్టుకు నేషనల్ అప్పీల్ కూడా వస్తుంది.

చిరు-అనుష్క
ఎప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి సరసన ఓ సాంగ్ చేసింది. తర్వాత మళ్లీ అవకాశం రాలేదు. ప్రస్తుతం సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న బొమ్మాలి, తన క్యారెక్టర్ తో సంబంధం లేకుండా మెగాస్టార్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గ్యారెంటీ.