96 తెలుగు రీమేక్ లో హీరో...?

Monday,October 29,2018 - 06:59 by Z_CLU

తమిళ బ్లాక్ బస్టర్ 96 తెలుగులో రీమేక్ కానుంది. బ్రాండెడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా తెలుగు రైట్స్ దక్కించుకున్నాడు. అయితే తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగు రీమేక్ లో హీరోగా ఎవరు నటించనున్నారనే క్వశ్చన్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, ఈ సినిమా కోసం రీసెంట్ గా నాని తో పాటు శర్వానంద్ ని సంప్రదించినట్టు తెలుస్తుంది. దాంతో ఈ ఇద్దరిలో ఈ సినిమా సెట్స్ పైకి రానున్న హీరో ఎవరా అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో జెనెరేట్ అవుతుంది.

మోస్ట్ సెన్సిటివ్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, తెలుగులోనూ అదే రేంజ్ సక్సెస్ అందుకోవడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు దిల్ రాజు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ తో పాటు, తక్కిన నటీనటులను ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.