NTR బయోపిక్ దర్శకుడెవరు...?

Thursday,April 26,2018 - 05:15 by Z_CLU

NTR బయోపిక్ నుండి తప్పుకున్నాడు దర్శకుడు తేజ. ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా నుండి తేజ తప్పుకోవడానికి రీజన్స్ అయితే బయటికి రాలేదు కానీ, ఈ ప్లేస్ ని ఆక్యుపై చేయబోయే డైరెక్టర్ ఎవరా..? అనే క్వశ్చన్ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్ పాయింట్ లా మారింది.

నిన్న మొన్నటి వరకు ఫ్యాన్స్ లో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అన్న క్యూరియాసిటీ ఉండేది. ఇప్పుడు ఈ సినిమా కోసం మెగాఫోన్ పట్టబోయే డైరెక్టర్ ఎవరా అనే ఆలోచన బిగిన్ అయింది. మరోవైపు ఫిల్మ్ మేకర్స్ వీలైనంత తొందరలో ఈ సినిమా డైరక్టర్ ని ఫిక్స్ చేసుకుని, సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చే ప్రాసెస్ లో ఉన్నారు.

 

ఈ సినిమా టీమ్ నుండి ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తో పాటు రీసెంట్ గా బాలయ్యతో ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న క్రిష్ ల పేర్లు  వినిపిస్తున్నాయి.  మరోవైపు స్వయంగా  బాలకృష్ణ  ఈ సినిమా  దర్శకత్వ బాధ్యతలు  టేకప్  చేసే  చాన్సెస్  ఉన్నాయన్న  టాక్  కూడా  గట్టిగానే  వినిపిస్తుంది.  ఏది ఏమైనా ఈ సినిమా ఏ డైరెక్టర్ తో సెట్స్ పైకి వస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.