కీర్తి సరే... మరో హీరోయిన్ ఎవరు?

Sunday,June 21,2020 - 11:00 by Z_CLU

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నెక్స్ట్ సినిమాగా ‘సర్కారు వారి పాట’ చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ తోనే అందరినీ ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమాకు క్యాస్టింగ్ ఫైనల్ అయ్యింది. మహేష్ సరసన మెయిన్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకున్నారు. అయితే కథలో మరో హీరోయిన్ కి కూడా చోటు ఉందట. నిడివి తక్కువగా ఉండే ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉందని తెలుస్తుంది.

ప్రస్తుతం ఆ క్యారెక్టర్ కోసం కొంతమందిని అనుకొని అందులో నుండి ఒకరిని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట పరశురాం. అయితే ఆ పాత్ర ఏంటి.. అందులో ఏ హీరోయిన్ కనిపిస్తుంది అనేది ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగిస్తుంది.

ఇప్పటికే సుదీప్ కిచ్చాను విలన్ గా తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి ఆ విషయంపై ఇంకా మేకర్స్ నుండి క్లారిటీ లేదు. సో అన్ని క్యారెక్టర్స్ కి నటీనటులు ఫైనల్ అయ్యాక సోషల్ మీడియా ద్వారా కాస్టింగ్ డీటెయిల్స్ షేర్ చేసే అవకాశం ఉంది.

14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి కూడా.